ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన వంటి నాయకుడిని, టీడీపీ వంటి పార్టీని రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకుడు గల్ఫ్ దేశాల్లో ఉంటే ఎప్పుడో ఉరి తీసేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి తెలుసుకున్న ప్రజలు పాలనలో మార్పు కోరుకున్నారని.. నవరత్నాలే వైఎస్సార్ సీపీని గెలిపించనున్నాయని పేర్కొన్నారు.