ఎన్నికలకు ముందు ప్లాన్ చేసుకుని అధికారులను బదిలీ చేశారని, ఇప్పుడు అలాంటి అధికారులపై ఈసీ చర్య తీసుకోవడంతో చంద్రబాబు ప్లాన్ బెడిసికొడుతుందని అందుకే ఆయన భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌వీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను నియమించిన ఏజంట్లు బదిలీ కావటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని నిలదీశారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.