ఆడలేక మద్దెల ఓడమన్నట్టు.. ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశాలు పూర్తిగా దూరమవడంతో కుట్రలు, కుతంత్రాలకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. ఏదోవిధంగా మళ్లీ అధికారాన్ని చేపట్టాలనే దురుద్దేశంతో ఓటర్ల తొలగింపునకు పూనుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.