రేపు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం రేపు(మే 25న) ఉదయం పదిన్నర గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ శాసనసభ్యుల బృందం రేపు మధ్యాహ్నం గౌరవ గవర్నర్‌ ఈసీఎల్‌ నరసింహన్‌ను కలవనున్నట్లు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top