ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులను త్యాగం చేసి, అమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పరామర్శించడానికి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొదటి నుంచి ప్రత్యేక హోదాకై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, హోదా ముగిసిపోయిన అధ్యాయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని అన్నారు. ఇందుకోసం నాలుగేళ్లుగా వైఎస్ జగన్ యువభేరీలు, ఆమరణ దీక్షలు, సభలు నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకున్నారని ఆమె విమర్శించారు.
ప్రత్యేక హోదాను జగన్ ఊపిరిగా భావిస్తున్నారు
Apr 8 2018 11:05 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement