వైఎస్సార్ హయాంలో సుబాబుల్ పంట టన్నుకు రూ.4,400 ధర లభించేదని, బాబు పాలనలో సుబాబుల్ పంట టన్నుకు కనీసం రూ.2500 కూడా లభించడం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ జగన్ ప్రసగించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆవేదన చెందుతున్నారని, అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నందిగామ నియోజకవర్గమని, బాధితులకు న్యాయం జరగకపోగా.. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని చంద్రబాబు, లోకేష్, ఆయన బినామీలు దోచుకున్నారని ఆరోపించారు.