సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఏ క్షణం లోనైనా వెలువడనున్న తరుణంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళ వారం వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం పూరిం చనుంది. కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేస్తూ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సమర శంఖారావ సభలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నెల్లూరులో నాలుగో సభకు సన్నాహాలు పూర్తి చేసింది. జిల్లాలోని పది శాసనసభా నియోజకవర్గాల్లో ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్‌లకూ కమిటీలు వాటికి కన్వీనర్లను నియమించారు.