రేణిగుంటకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy To Visit Tirumala | Sakshi
Sakshi News home page

రేణిగుంటకు చేరుకున్న వైఎస్‌ జగన్‌

May 28 2019 7:19 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన.. సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు.. జననేతకు ఘనస్వాగతం పలికారు. కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరి.. వైఎస్‌ జగన్‌ తన అభిమానులకు అభివాదం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement