చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం టి.సి.అగ్రహారంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్‌ను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం విరాళంగా వాటర్ ప్యూరిఫయర్‌ను అందించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా, అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటి పంపిణీని మొదలుపెట్టారు.