చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, రైతులు బాబు పాలనలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని, చంద్రబాబు సీఎం కావడంతో ఆయనతోపాటు కరువు కూడా వచ్చిందని అన్నారు.