చంద్రబాబు తానా అంటే ... ఆయనకు తందానా చెప్పే దానికే పవన్‌కల్యాణ్ ఉన్నారు. ఆయన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరుతో ఓ కమిటీ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ఎంతిచ్చిందీ... రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుందీ నిజనిర్థారణ చేస్తారట. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఉంటున్న చంద్రబాబే రాష్ట్రానికి బీజేపీ వాళ్లు దండిగా ఇచ్చారని నాలుగేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్లేటు మార్చి, డ్రామాలాడుతూ మళ్లీ ఆయనే కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెప్పడం చూస్తూంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. చంద్రబాబే ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉంటే... ఇంకా పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి వాళ్లు(కేంద్రం) ఏమిచ్చారు? వీళ్లేమి తీసుకున్నారు? అని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేస్తాడట. నిజంగా ఇది కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉంది. చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు నేనొక్కటే చెబుతున్నా... ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు, రూపాయి, అర్ధ రూపాయి తక్కువ ఇచ్చారని నానా యాగీ చేయడం కానే కాదు, మీరు చేయాల్సిందల్లా.... ప్రత్యేక హోదా మా హక్కు అని పోరాటం చేయడమే అని చెబుతున్నాను.
బాబు తానా అంటే... పవన్ తందానా...
Feb 19 2018 8:16 AM | Updated on Mar 21 2024 10:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement