ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌ | Watch Video,Love Failure Young Man Selfie Suicide | Sakshi
Sakshi News home page

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

May 22 2019 9:28 PM | Updated on Mar 21 2024 11:09 AM

ప్రేమలో విఫలమైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం వీడియో చిత్రీకరించి దాన్ని స్నేహితులకు వాట్సాప్‌ చేశాడు. ఈ సంఘటన సిద్ధిపేట జల్లాలోని మద్దూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దూరు మండలం మరుమల్లె గ్రామానికి చెందిన అనిల్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి ప్రేమను అంగీకరించని అమ్మాయి తండ్రి ఆమెకు వేరే పెళ్లి నిశ్చయం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పురుగుల మందు కొనుక్కుని ఊరికి దూరంగా వెళ్లాడు.

తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి, పురుగుల మందుతాగాడు. అనంతరం వీడియోను మిత్రులకు పంపాడు. వీడియోలో : తల్లిదండ్రులు పిల్లలను అర్థంచేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. పిల్లలను పక్కవారితో పోల్చి బాధపెట్టవద్దని కోరాడు. చివరగా  ‘‘చావు నా కళ్లముందు ఉన్నపుడు నా ముఖంపై చిరునవ్వుండాలి, నా చెయ్యి నా మీసం మీదుండాలి’’ అన్న సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. అది కేవలం సినిమా మాత్రమేనని తాను చేస్తున్నది రియల్‌ అని పేర్కొన్నాడు. తన ముఖంపై చిరునవ్వు ఉందని, మీసంపై చెయ్యి ఉందని చెప్పి, మీసం మెలితిప్పి.. పురుగుల మందు సేవించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement