సీఎం నితీశ్‌పై గ్రామస్తుల రాళ్ల దాడి | Video Shows Alarming Attack on Nitish Kumar Convoy | Sakshi
Sakshi News home page

సీఎం నితీశ్‌పై గ్రామస్తుల రాళ్ల దాడి

Jan 14 2018 12:54 PM | Updated on Mar 22 2024 11:03 AM

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కొందరు గ్రామస్తులు చుక్కలు చూపించారు. అది కూడా అడ్డుకోవడంతోనో.. ఆందోళనతోనో కాదు.. ఏకంగా పెద్ద పెద్ద ఇటుకపెడ్డలు, రాళ్లు, కర్రలతో. సెక్యూరిటీ సిబ్బందితోపాటు ప్రత్యేక భద్రతా దళం కూడా ఈ దాడిలో గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల నందన్‌ అనే గ్రామం మీదుగా పర్యటనకు వెళుతుండగా అనూహ్యంగా అప్పటి వరకు శాంతియుతంగా కనిపించిన గ్రామస్తులు రాళ్ల వర్షం కురిపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement