రోడ్డుపై మద్యం తాగొద్దని వారించిన పోలీసుపై దాడి చేశారు నలుగురు తాగుబోతు యువకులు. మద్యంమత్తులో పోలీసు కానిస్టేబుల్ అని చూడకుండా దుర్భాషలాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న చెన్నైలోని రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసులు కారు దగ్గరకు వెళ్లి చూడగా కొంతమంది మద్యం సేవిస్తున్నారు. పబ్లిగ్గా మద్యం సేవించవద్దని పోలీసు వారిని హెచ్చరించారు. దీంతో కోపోద్రుక్తులైన యువకులు పోలీసు అధికారిపై దాడి చేశారు. అసభ్యపదజాలంతో తిడుతూ అతని వద్ద ఉన్న లాఠీని లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసు ప్రయత్నిచగా అతని చేతులను పట్టుకొని దాడి చేశారు. చివరకు అటుగా వెళ్తున్న వాహనదారులు వచ్చి ఆపడంతో పోలీసును వదిలేశారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు పేర్కొన్నారు.
పబ్లిగ్గా తాగొద్దన్నందుకు పోలీసుపై..
Jun 22 2019 2:17 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement