చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థకి చెందిన ఓ బస్సు డ్రైవర్ పత్రిక చదువుతూ బస్సుని నడుపుతున్న వీడియో వైరల్ అవుతోంది. తమిళనాడులోని చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థలో 3,500పైన బస్సులు చెన్నై మొత్తం నడుస్తున్నాయి. డ్రైవర్లు ఇలా సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా బస్సు నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్పొరేషన్ బస్సు డ్రైవర్ బస్సు నడుపుతూ స్టీరింగ్‌పై పత్రిక ఉంచి చదువుతున్నట్టుగా ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తోంది.