‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్’ పోటీలను వేలంవెర్రిలాగా చూస్తున్న జనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనే విషయం తెల్సిందే. అదే తరహాలో ఇప్పుడు బ్రిటన్ విద్యార్థులకు వేలం వెర్రిలాగ ఓ ఆట పట్టుకుంది. అదే బాక్సింగ్. డబ్లూడబ్లూఎఫ్ పోటీల్లో పాల్గొనే కండల వీరులు కదం తొక్కుతు రింగ్‌లోకి వస్తుంటే అందమైన భామలు కరతాల ధ్వనులతో హావభావాలతో వారికి స్వాగతం చెప్పడం, నిర్వాహకులు హంగామా చేయడం తెల్సిందే. అదే తరహాలో లండన్‌లో జరుగుతున్న బాక్సింగ్‌లో పాల్గొనే విద్యార్థులు చొక్కా లేకుండా వేదికపైకి వస్తుంటే పొగ గొట్టాలు చిమ్మడం, గాలి బుడగల నురుగు ఎగిసి పడటం, స్వర్ణ కాంతులు విరజిమ్మడం చూడముచ్చటగా ఉంటుంది. అంతకన్నా ముచ్చటగా ఉండే ముద్దుగుమ్మలు హొయలుపోతూ పోటీదారులకు స్వాగతం చెప్పడం, కరతాళ ధ్వనులతో తోటి విద్యార్థినులే వారిని ప్రోత్సహించడం అంతా ఓ మ్యూజిక్ ఫెస్టివల్లా ఉంటుంది.
అందమైన భామల మధ్య వేలంవెర్రి పోటీ!
Aug 10 2019 2:19 PM | Updated on Aug 10 2019 2:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement