ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఢిల్లీలో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడిన తీరును చూస్తే ఆయన తండ్రి దివంగత వైఎస్సారే గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. పాలనలో అవినీతి లేకుండా పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు.