ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. డిమాండ్ల సాధనకు పిలుపునిస్తూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5న సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. దీంతో వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక సోమవారం జరిగిన విచారణలో.. ఆర్టీసీ కార్పొరేషన్ వద్ద కేవలం రూ. 7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు అవసరమవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు.