ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే.
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
Nov 9 2019 6:26 PM | Updated on Nov 9 2019 6:33 PM
Advertisement
Advertisement
Advertisement
