ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కార్మిక సంఘాలకు, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా రెండు వైపుల నుంచి ఎక్కడా ఆ వాతావరణం కనిపించటం లేదు. తాము చర్చలకు సిద్ధమే నని, కానీ ఎవరితో చర్చించాలో తేల్చాల్సింది ప్రభుత్వమేనంటూ కార్మిక సంఘాలు చెబు తుండగా తాత్కాలిక ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలంటూ ఆదేశించిన ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మరో సారి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవ కాశం కనిపిస్తోంది.
కోర్టులో చేతిలో ‘చక్రం’
Oct 18 2019 8:27 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement