రైతుబంధు పధకాన్ని ప్రారంభించిన కేసీఆర్ | Sakshi
Sakshi News home page

రైతుబంధు పధకాన్ని ప్రారంభించిన కేసీఆర్

Published Thu, May 10 2018 1:58 PM

‘‘జూన్‌ 2 నుంచి రైతులు రిజిస్ట్రేషన​ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసంరలేదు. అన్ని మండలకేంద్రాల్లోని తహశీల్దార్‌లకే అన్ని బాధ్యతలు ఇచ్చాం. భూములు అమ్మాలన్నా, కొనాలన్నా  ప్రక్రియ మొత్తం గంటల్లోనే పూర్తవుతుంది. భూముల సమగ్ర వివరాలను పొందుపర్చిన ‘ధరణి’ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు అప్‌లోడ్‌ అవుతూంటాయి. రిజిస్ట్రేషన్‌తోపాటు ఆర్‌వోఆర్‌లకూ ఇబ్బందులు ఉండవు. గోల్‌మాల్‌కు ఆస్కారమేలేని విధంగా విధానాలను రూపొందించాం. ఇంకోమాట.. జూన్‌ 2 తర్వాత ఏ ఒక్కరూ తమ పాస్‌ పుస్తకాలను బ్యాంకులకు తాకట్టుపెట్టాల్సిన అవసరం లేదు. అది నిబంధనలకు విరుద్ధం’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Advertisement
Advertisement