ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న కేసులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వి.రఘును అరెస్టు చేసి విశాఖపట్నం తరలించారు. షిర్డీలో రఘు అక్క పేరిట ఉన్న హోటల్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈయన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.