పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతీసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇక, ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇకపోతే, జమ్ము కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోందని భారత్ మండిపడింది. భారత్‌పై పాక్ విద్వేష విషం చిమ్ముతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి నాగరాజ్ నాయుడు దుయ్యబట్టారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Jan 23 2020 8:02 PM | Updated on Jan 23 2020 8:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement