నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా, దిశ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుల మృతదేహాలను .. మృతుల తల్లిదండ్రులు, వారి తరఫున వైద్యుల సమక్షంలో పరిశీలించింది. మరోవైపు ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు మృతి చెందింది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.
ఈనాటి ముఖ్యాంశాలు
Dec 7 2019 8:07 PM | Updated on Dec 7 2019 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement