ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Dec 24th Central Cabinet approves Census of India 2021 and NPR | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 24 2019 7:46 PM | Updated on Mar 21 2024 8:24 PM

కృష్ణా, గోదావరి జలాలతో వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరోవైపు జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్‌ హేమంత్ సొరేన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ప్రకంపనల తీవ్రత కొనసాగుతుండగానే కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఇకపోతే, మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నాగిరెడ్డి మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement