ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 11th Feb 2020 | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Feb 11 2020 8:29 PM | Updated on Mar 22 2024 11:10 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయాన్ని ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్‌ అభివర్ణించారు. ఇక, చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు భారత్‌ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మోదీ రాసిన లేఖకు చైనా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు కానున్నాయి. ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్టర్‌ను మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. మరోవైపు టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన న్యూజిలాండ్‌.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది.  మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement