విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. ఇది ఇలా ఉండగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు.