ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని తరలింపుపై మంగళవారం కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డుల జారీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనర్హులను మాత్రమే తొలగించామని, సమగ్ర విచారణ అనంతరం ఇంకా అనర్హులుంటే తొలగిస్తామని స్పష్టం చేశారు.ఇక స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.