ఈనాటి ముఖ్యాంశాలు | Today news round up 31st Dec CBI Files Case Against Rayapati Sambasiva Rao | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 31 2019 7:58 PM | Updated on Mar 21 2024 8:24 PM

జనవరి 1నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. జనవరి 1వ తేదిని ఆర్టీసీ ఉద్యోగుల నియామక డేగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదేవిధంగా భారత 28వ నూతన సైనికాధిపతిగా జనరల్ మనోజ్‌ ముకుంద్‌ నర్‌వణే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement