తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉండగా అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదివారం పోలవరంలో పర్యటించారు.