జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులు సహా మొత్తం 16మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.