శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి (లెజిస్లేచర్ కార్యదర్శి–ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని, టీడీపీకి చెందిన కరణం బలరాం తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన ఫలితంగా ఏర్పడిన ఖాళీలకు ఇటీవల విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
Aug 20 2019 8:12 AM | Updated on Aug 20 2019 8:44 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement