కడుపుబ్బ నవ్విస్తున్న దొంగల వీడియో | Thief Knocks Down another thief video goes viral | Sakshi
Sakshi News home page

Feb 15 2018 7:24 PM | Updated on Mar 20 2024 3:50 PM

ఇద్దరు దొంగలు చోరీ కోసం వెళ్లి విఫలమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. చివరికి నాటకీయ పరిస్థిత్తుల్లో దొంగలు అక్కడి నుంచి బయటపడ్డారు. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు స్వయంగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. షాంఘైలో ఫిబ్రవరి 14న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు చోరికి వెళ్లారు. మాస్కులు ధరించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దొంగలు చోరీ యత్నం చేయకముందే తీవ్ర ఇబ్బందులపాలు కావడం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement