దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఉదంతంపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. తన సోదరికి ఫోన్ చేసే బదులు బాధితురాలు 100 నంబరుకు కాల్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని... ప్రియాంకారెడ్డి చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని వ్యాఖ్యానించారు.