చంద్రబాబు డైరెక్షన్ - తమ్ముళ్ల యాక్షన్ | TDP MLCs Discuss With Chandrababu About Their Rowdyism In Council | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డైరెక్షన్ - తమ్ముళ్ల యాక్షన్

Jan 22 2020 5:41 PM | Updated on Jan 22 2020 5:45 PM

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకునేలా టీడీపీ చేస్తున్న కుయుక్తులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్‌లో.. టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా యాక్షన్‌ చేశారో తెలిపే వీడియో ఒకటి బయటికొచ్చింది. మండలిలో తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో టీడీపీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. వారు అలా చెబుతుంటే చంద్రబాబు చాలా బాగా చేశారని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు.. టీడీపీ సభ్యులు బెజవాడ రౌడీయిజం అని ఓ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడినా కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు విస్తుపోతున్నారు.  హుందాగా ఉండాల్సిన పెద్దల సభలో టీడీపీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement