జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపాలెంలో సాగునీటి మళ్లింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి 50 లక్షల రూపాయల వ్యయంతో చిన్నశెట్టి పాలెంలో సాగునీటి కోసం పైపు లైన్ పనులు చేపట్టారు.