జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో కలకలం రేపుతున్నారు. టీడీపీ అనుకూల పచ్చ మీడియాను టార్గెట్ చేసిన ఆయన శనివారం ఉదయం మరిన్ని ట్వీట్లు చేశారు. ‘నిజమైన అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? అంటూ ట్వీట్ చేశారు. ‘నాకు ఇష్టమైన స్లోగన్ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తలుని జాతీయం చెయ్యాలి’. అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?’ అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. ‘స్టే ట్యూన్‌డ్.. లైవ్ ఫ్రమ్ హైదరాబాద్.. నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్ కళ్యాణ్’ అంటూ పేర్కొన్నారు.