మహారాష్ట్ర పుల్గాన్‌లోని ఆర్మీ డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వార్ధా జిల్లాలోని ఆర్మీకి చెందిన ఆయుధ గోదాములో మంగళవారం ఉదయం కాలం చెల్లిన మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేసే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఘటన స్థలంలోనే నలుగురు వ్యక్తులు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరో ఇద్దరు మరణించారు. మృతి చెందిన వారిలో ఆయుధ గోదాములో పనిచేసే ఓ ఉద్యోగితోపాటు ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.