అభం శుభం తెలియని బాలికలను బలవంతంగా దేవదాసీ వృత్తిలోకి దింపుతున్నారు. వారు దేవుడికి సేవ చేయాలన్న కారణం చూపి.. లైంగిక వాంఛ తీర్చుకుంటున్న దారుణాలు నేటికీ ఎన్నో జరుగుతున్నాయి. జోగిణి, బసివిణి, దేవదాసి, మాతంగి.. ఇలా పేరు ఏదైనా జరిగేది మాత్రం లైంగిక దోపిడీయే. మొదట.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓ బాలికను ఎంచుకుంటారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు పొలం ఇస్తామంటారు. లేదంటే ఇంటి స్థలమో, లేదంటే అనారోగ్యాన్ని కారణంగా చూపుతారు. అమ్మవారు పట్టిందని అంటారు. దేవుడికి జీవితాన్ని అంకితం ఇవ్వాలని ఇది సంప్రదాయమని ఎప్పటినుంచో వుందని అంటారు. జోగిని, బసివిని, మాతంగి, దేవదాసి, పార్వతి, పద్మావతి ఇలా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో ఈ దురాచారం కొనసాగుతోంది.