మాటకు విపరీత అర్థాలు తీసి, లేనిది ఉన్నట్లుగా చెప్పి.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. దానిలో భాగమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్డీయేలో చేరుతున్నట్లుగా రాసిన తప్పుడు వార్త అని, అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదని పెద్దలంటారని.. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.