నా వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడు | Rajinikanth Responded On His Party Launch | Sakshi
Sakshi News home page

నా వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడు

Mar 20 2018 6:07 PM | Updated on Mar 22 2024 11:07 AM

తమిళ ఉగాది ఏప్రిల్‌ 14న  తాను రాజకీయ పార్టీ, జెండా ప్రకటించడం లేదని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తమిళనాడులో మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ధ్వంసం, వీహెచ్‌పీ రథయాత్రలపై స్పందించిన రజనీకాంత్ పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రామ రాజ్య రథయాత్రతో మత విద్వేషాలు చెలరేగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement