ప్రియాంక హత్య: నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను పోలీసుల విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ప్రజాగ్రహం కారణంగా వారిని కోర్టులో ప్రవేశపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో మండల మెజిస్ట్రేట్ పాండునాయక్, డాక్టర్లు నేరుగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. నిందితులను మహబూబ్‌నగర్ జైలుకు తరలించేందుకు పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఆందోళకారులు పెద్ద ఎత్తన అక్కడికి చేరుకోవడంతో వారి కంటపడకుండా నిందితులను తరలించేందుకు దాదాపు పదికి పైగా వాహనాలను సిద్ధం చేశారు. పటిష్ట బందోబస్త్ నడుమ మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి