వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం | Priest Commits Suicide Attempt in East Godavari | Sakshi
Sakshi News home page

వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

Dec 14 2018 3:45 PM | Updated on Dec 14 2018 3:51 PM

పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పనిచేసే అర్చకుడు ఆలయ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండల ఎం కోటపాడు గ్రామానికి చెందిన పాణింగపల్లి çఫణికుమారాచార్యులు ఏడాది కాలంగా ఆలయంలో అర్చకత్వం చేస్తున్నారు. ఈ ఆలయం ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో నడుస్తోంది. ఆలయ నిర్వాహకులు కొంత కాలంగా తనను వేధిస్తున్నారని, వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాని పేర్కొంటూ వాట్సాప్‌లో వీడియో మెసేజ్‌ పెట్టి ఎలుకల మందు సేవించాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement