కుటుంబ పాలనను కాపాడుకునేందుకే దేశంలోని ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ భవిష్యత్‌ను మార్చేందుకు బీజేపీ కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రతిపక్ష కూటములను చూసి బెదిరిపోవద్దనీ, ప్రజలే వారిని తిరస్కరిస్తారని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకుండా, సైన్యాన్ని, దేశాన్ని అవమానించేవారిని ప్రజలు అసహ్యించుకుంటారని వ్యాఖ్యానించారు.