కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషుల పక్షానే నిలుస్తుందని ప్రధాని మోదీ∙విమర్శలు చేశారు. ట్రిపుల్ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–ఘాజీపూర్‌లను అనుసంధానించే 340 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు (రూ.23వేల కోట్లు విలువైన) ఆజంగఢ్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు.