గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి ఎమ్మెల్యే ప్రాథ‌మిక చికిత్స‌ | Piduguralla: MLA Sridevi First Aid To Road Accident Victim | Sakshi
Sakshi News home page

గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి ఎమ్మెల్యే ప్రాథ‌మిక చికిత్స‌

Aug 6 2020 8:35 PM | Updated on Mar 22 2024 10:50 AM

సాక్షి, గుంటూరు: ప‌్రాణాపాయంలో ఉన్న యువ‌కుడికి ప్రాథ‌మిక చికిత్స చేసి తాడికొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ శ్రీదేవి మాన‌వ‌త్వం చాటుకున్నారు. ఆమె గురువారం హైద‌రాబాద్ వెళ్తుండ‌గా పిడుగురాళ్ల ద‌గ్గ‌ర ఓ లారీ బైకును ఢీ కొట్టిన దృశ్యం కనిపించింది. బైకు పై ఉన్న వ్య‌క్తి తీవ్ర‌గాయాల‌తో రోడ్డుపై ప‌డిపోయి క‌నిపించాడు. క‌రోనా భ‌యంతో అక్క‌డున్న స్థానికులు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అటుగా వ‌చ్చిన‌ ఎమ్మెల్యే శ్రీదేవి వెంట‌నే బాధితుడి చెంత‌కు చేరారు. గాయాల‌పాలైన యువ‌కుడికి ముందుగా ప్రాథ‌మిక చికిత్స చేశారు. అనంత‌రం ఆమె పోలీసులు, 108కు స‌మాచార‌మిచ్చారు. వారు వ‌చ్చేంత‌వ‌ర‌కు అక్క‌డే ఉండి, ఆ త‌ర్వాత ఎమ్మెల్యే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement