పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య | Paritala: Young Man Last Breath By Jumping Into Krishna River | Sakshi
Sakshi News home page

పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య

Sep 4 2020 11:28 AM | Updated on Mar 21 2024 7:59 PM

సాక్షి, కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ యువకుడు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు పట్టుబడ్డాడు. విషయం అందరికీ తెలిసిపోవటంతో మనస్తాపం చెందిన రాజశేఖర్‌రెడ్డి నిన్న రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడని పోలీసులు కొట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తల్లి ఆరోపించారు. మరోవైపు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామే తప్ప కొట్టలేదంటున్న పోలీసులు చెప్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement