కంధమాల్ జిల్లాలోని గుమ్సాహి గ్రామానికి కనీసం నడవడానికి అనుకూలమైన రోడ్డు కూడా లేదు. ఇక విద్యుత్, మంచినీటి సరఫరా ముచ్చట మాట్లాడకుంటేనే మేలు! భరింపశక్యం కాని పరిస్థితుల్లో మిగతావారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. కూరగాయలు అమ్ముకుంటూ అతికష్టం మీద జీవనం సాగించే జలంధర్ నాయక్ కుటుంబమొక్కడే మిగిలిందక్కడ! నాయక్ దంపతులకు ముగ్గురు కొడుకులు. పేదరికంలోనూ పిల్లల్ని చదివించాలనే పట్టుదలవారిది.