దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు.