తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నమ్మక ద్రోహం, కుట్రలపై సుదీర్ఘ ప్రసంగం చేస్తూ... బ్రిటీష్ వాళ్లపైనే పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ స్పీచ్ దంచికొట్టారు. అసలు తెలుగుదేశం ఆవిర్భవించిందే 1982లో అయితే బ్రిటీష్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎలా పోరాడుతుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.